Nandamuri Mokshagna | నందమూరి మోక్షజ్ఞ.. ఎంట్రీకి అంతా సిద్థం!
ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఓ శుభవార్త. నందమూరి వంశ నవ వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీకి రంగం సిద్దమైనట్లు సమాచారం. బాలకృష్ణ (Balakrishna) తన తనయుడిని 2025 లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఓ శుభవార్త. నందమూరి వంశ నవ వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీకి రంగం సిద్దమైనట్లు సమాచారం. బాలకృష్ణ (Balakrishna) తన తనయుడిని 2025 లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని కోసం నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి ఫిట్నెస్ తో రెడీ అయ్యాడని టాక్. మోక్షజ్ఞ కొత్త లుక్ ఒకటి షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు చాలా బొద్దుగా కనపడే మోక్షజ్ఞ , ఇప్పుడు ఒక హీరోకి కావల్సిన క్వాలిటీస్ తో చాలా ఫిట్ గా రెడీ అయ్యాడు.
బాలయ్య బాబు పలువురితో చర్చలు జరుపుతున్నప్పటికి ఇంకా కథ , దర్శకుడిని ఎంపిక చేయలేదట. . తమ సొంత బ్యానర్ లో కాకుండా పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలని బాలకృష్ణ ఆలోచన అని సన్నిహితులు చెబుతున్నారు. ఓ వైపు బాలయ్య కుమార్తెలు బ్రాహ్మిణి, తేజశ్విని కూడా తమ తమ్ముడు మోక్షజ్ఞ ను తమ నిర్మాణ సంస్థ ద్వారా తెరకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం నిర్మాణ రంగంలో అడుగుపెట్టడానికి సిద్దంగా ఉన్నారంట బ్రాహ్మిణి.ఇప్పటికే బాలయ్య చిన్న కూతురు తేజశ్విని తండ్రికి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటుంది. షూటింగ్ ల దగ్గరి నుంచి అన్ని షోల వరకు తను దగ్గరుండి చూసుకుంటుంది.
మోక్షజ్ఞ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మతో (Prashanth Varma) చర్చలు జరిగినట్లు తెలుస్తుంది కానీ ఏది ఇంకా తేల్చలేదు. మోక్షజ్ఞ మొదట సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకపోయిన,ఎట్టకేలకు పూర్తి గా సిద్దమై ఎంట్రీ ఇవ్వనున్నాడు.బాలయ్య వారసుడి కోసం అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. నందమూరి వంశంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మూడోతరం వారసులుగా సినిమాలలో నటిస్తున్నారు. మోక్షజ్ఞ రాక తో మరొక హీరో నందమూరి వంశంలో చేరినట్లు చెప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మెగా ఫ్యామిలిలోనే ఉన్నారు . ఆ తరువాత నందమూరి వంశం హీరోలే ఎక్కువగా ఉన్నట్లు చెప్పొచ్చు.
Read Also :
Producer Suresh Babu | ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా సినిమాలు తీయాలి : ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు
Bharateeyudu-2 | చిక్కుల్లో భారతీయుడు-2 మూవీ..! రిలీజ్ ఆపాలంటూ కోర్టులో పిటిషన్..! అసలేం జరిగిందంటే..?
Youtuber Hanumantu | యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

