Bharateeyudu-2 | చిక్కుల్లో భారతీయుడు-2 మూవీ..! రిలీజ్ ఆపాలంటూ కోర్టులో పిటిషన్..! అసలేం జరిగిందంటే..?
Bharateeyudu-2 | విశ్వనటుడు కమల్ హసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ భారతీయుడు-2. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానున్నది. ఈ క్రమంలో చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్ర అనే వ్యక్తి మధురై జిల్లా కోర్టును ఆశ్రయించారు.
Bharateeyudu-2 | విశ్వనటుడు కమల్ హసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ భారతీయుడు-2. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానున్నది. ఈ క్రమంలో చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్ర అనే వ్యక్తి మధురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా సినిమాలో మర్మకళ టెక్నిక్‌ను ఉపయోగించారని, ఈ నేపథ్యంలో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మూవీని రిలీజ్ చేయకుండా బ్యాన్ చేయాలంటూ ఆయన కోర్టును కోరారు. రాజేంద్రన్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది.
అయితే, ఈ విషయంపై స్పందించాలని భారతీయుడు-2 మూవీ బృందానికి సూచిస్తూ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రాచీన యుద్ధకళ అయిన మర్మకళలో రాజేంద్రన్ మంచి పట్టున్నది. ఆయన రాసిన బుక్‌ను చూసి స్ఫూర్తి పొందిన డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు’ మూవీలో మర్మకళకు సంబంధించిన పలు సన్నివేశాలను తెరకెక్కించారు. ‘భారతీయుడు’ సేనాపతి పాత్రధారి అయిన కమల్ హసన్‌కు మర్మకళపై ప్రత్యేకంగా రాజేంద్రన్ శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు-2 మూవీ తెరకెక్కింది. అయితే, తన అనుమతి లేకుండా సీక్వెల్లో మర్మకళ టెక్నిక్స్‌ను వినియోగిస్తున్నారని రాజేంద్రన్ ఆరోపించారు.
కమల్ హసన్ హీరోగా, శంకర్ దర్శకుడిగా తెరకెక్కిన ‘భారతీయుడు’ మూవీ 1996 విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నది. ఈ మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు-2 మూవీ ఈ నెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో వివాదం నేపథ్యంలో మూవీ వాయిదా పడుతుందా? షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ అవుతుందా? అనేది సందేహాస్పదంగా మారింది. ఇక ఈ మూవీలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్యా, బాబీ సింహా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

