అఖిల్ అక్కినేని (Akhil Akkineni) మరికొన్ని రోజుల్లో ఏజెంట్ (Agent)గా సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో సురేందర్ రెడ్డి (Surenderreddy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరుగుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. తాజా అప్డేట్స్ ప్రకారం ఏజెంట్ థ్రియాట్రికల్ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాక్.
ఆంధ్రా, నైజాం, సీడెడ్ ఏరియాల్లో కలిపి ఇంత భారీ మొత్తం పలికినట్టు ఇన్ సైడ్ టాక్. ప్రముఖ గాయత్రి దేవి ఫిలిమ్స్ వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సతీశ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ మొత్తానికి ఏజెంట్ థ్రియాట్రికల్ హక్కులు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై అనిల్ సుంకర, సురేందర్‌రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తుండగా.. వక్కంతం వంశీ కథనందిస్తున్నారు.
ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా.. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఏజెంట్ నుంచి విడుదలైన మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
Read Also :
Ram Charan | ఆస్కార్ క్రెడిట్ మాది కాదు.. ఏబీసీ ఛానల్ చిట్‌చాట్‌లో రాంచరణ్
Rao Ramesh | గెట్ రెడీ.. హీరోగా రావురమేశ్.. సినిమా వివరాలివే
RRR | ‘నాటు నాటు’ పాటకు పాక్ నటి డ్యాన్స్.. వీడియో వైరల్..!