టాలీవుడ్ యాక్టర్ అఖిల్ అక్కినేని (Akhil Akkineni) చాలా కాలం తర్వాత ఏజెంట్ (Agent)గా యాక్షన్ అవతార్‌లో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అంటున్నాడు. సురేందర్ రెడ్డి (Surenderreddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏజెంట్‌తో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరువబోతుంది.
కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్లాన్ వేగవంతం చేశారు. తాజా అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ఏజెంట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు రెడీ అయ్యింది అఖిల్ టీం. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్‌తో మూవీ లవర్స్ ముందుకు రాబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. ప్రమోషనల్ ఈవెంట్స్ షెడ్యూల్‌పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏజెంట్లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా.. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. అఖిల్ ఇదివరకెన్నడూ కనిపించని స్టన్నింగ్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు ఇప్పటికే టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథనందిస్తున్నారు.
మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియో..
ఏజెంట్ టీజర్..
MalaikottaiVaaliban | ప్రీ లుక్‌తో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్డేట్
Karthik Ghattamaneni | పుకార్లకు చెక్ పెట్టిన రవితేజ డైరెక్టర్..
Mrunal Thakur | చాలా ఎక్జయిటింగ్‌గా ఉందంటోన్న మృణాళ్ ఠాకూర్