Akhanda Sequel | హీరోలకు అభిమానులుండటం సహజం. అలాగే కొన్ని సినిమాలక్కూడా ప్రత్యేకంగా ఫ్యాన్సుంటారు. అలా సపరేట్ ఫ్యాన్‌ని ఏర్పరచుకున్న సినిమాల్లో ‘ ’ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందనగానే ఆడియన్స్‌లో అంచనాలు అంబరాన్ని తాకాయి. మొన్నటివరకూ ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తామని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట చెబుతూ వచ్చారు.
ఇప్పుడు మీడియాలోనేమో ‘అఖండ -తాండవం’ సంక్రాంతికి షిఫ్టయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాస్తవం ఏంటో తెలియాల్సివుంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా జార్జియాలో జరిగింది. వచ్చే నెల తొలివారం నుంచి కొత్త షెడ్యూల్‌ని దర్శకుడు బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ల్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా బోయపాటి చిత్రీకరిస్తారట.
దీనికోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ, మిగతా తారాగణం, దాదాపు వేయిమంది జూనియర్ ఆర్టిస్టులు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటారని సమాచారం. సినిమాకే హైలైట్‌గా ఈ సీక్వెన్స్ ఉండబోతున్నదని తెలుస్తున్నది. 14రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్తా మీనన్, కావ్య థాపర్, జగపతిబాబు, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్.