Akhanda movie | బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఏకంగా 100 కోట్లు వసూలు చేసి.. రాబోయే సినిమాలకు ఎక్కడలేని ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వకీల్ సాబ్ సినిమా తర్వాత వంద కోట్ల క్లబ్బులో చేరిన సినిమా ఇదే. మరోవైపు బాలకృష్ణకు 100 కోట్ల మార్కెట్ ఉందని ఇప్పటి వరకు ఎవరూ అనుకోలేదు. ఆయన సినిమాలు కనీసం 30 కోట్ల షేర్ కూడా వసూలు చేయడం కష్టంగా ఉన్న రోజుల్లో.. ఏకంగా 100 కోట్లు వసూలు చేసి చూపించాడు బోయపాటి శీను. అందులో 60 కోట్ల షేర్ ఉంది.
విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన విజయం అందుకుంది అఖండ. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమా.. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ లాభాలు తీసుకువచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా అసలు మార్కెట్ లేదు అని అనుకుంటున్న ఓవర్సీస్ లో కూడా బాలకృష్ణ అద్భుతాలు చేశాడు. అక్కడ మూడో రోజు నుంచి లాభాలు అందుకుంది ఈ సినిమా. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ క్రాస్ చేసి దూసుకుపోతుంది. మరోవైపు నైజాంలో బాలకృష్ణ కాస్త వీక్ అనే విషయం ఆయన గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అలాంటిది అఖండ నైజాంలో ఏకంగా 26 కోట్ల గ్రాస్.. 16 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఏపీలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. అన్ని బాగానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం అఖండ దర్శక నిర్మాతలు బాగా ఫీలయ్యారు. ఏపీలో టికెట్ రేట్లు మునపటిలా ఉండుంటే కచ్చితంగా ఈ సినిమాకు మరో 10 కోట్లు అదనంగా వచ్చేవనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. ఆ విషయంలో నిర్మాతలు బాగా హర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న 5 రూపాయల టికెట్ నుంచి 250 వరకు అన్ని కలిపి ఏపీలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కచ్చితంగా రాబోయే సినిమాలకు అద్భుతమైన బూస్టప్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Akhanda: విజయోత్సవ వేడుకలో సాష్టాంగ నమస్కారం చేసి ఆశ్చర్యపరచిన హీరోయిన్
అఖండ సినిమా ఇంటర్వ్యూలో బాలయ్యబాబు పంచులే పంచులు..!!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్