అనుకున్న లక్ష్యం అద్భుతంగా పూర్తిచేశాడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). 50 కోట్ల కలెక్షన్స్.. అది కూడా ఇలాంటి సమయంలో బాలయ్య సినిమాకు ఎప్పుడు రావాలి అని హేళన చేసిన వాళ్లకు చెంప పెట్టులా సమాధానం చెప్పాడు నందమూరి నటసింహం. ఆయన నటించిన అఖండ (AKhanda) సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు ప్రభంజనం కురుస్తుందని ఎవరూ కలలోనైనా ఊహించలేదు. కానీ అనుకోనిది జరిగింది. అఖండ ఆగమనంతో బాక్సాఫీస్ కు పట్టిన తుప్పు వదిలి పోయింది.
అఖండ సినిమా కేవలం 8 రోజుల్లోనే 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బోయపాటి శీను (Boyapati srinu) తెరకెక్కించిన ఈ సినిమా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చింది. కథ రొటీన్ గానే ఉన్నా మాస్ ఎలిమెంట్స్ బాగా ఉండడంతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న అఖండ.. 8వ రోజు కూడా అదే చేసింది. విడుదలైన 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.31 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 1.6 కోట్లు వసూలు చేసింది.
ప్రాంతాల వారిగా…
నైజాం: 15.30 కోట్లు
సీడెడ్: 11.98 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.70 కోట్లు
ఈస్ట్: 3.24 కోట్లు
వెస్ట్: 2.57 కోట్లు
గుంటూరు: 3.80 కోట్లు
కృష్ణా: 2.79 కోట్లు
నెల్లూరు: 2.02 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 46.42 కోట్లు (73.20 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.85 కోట్లు
ఓవర్సీస్: 4.58 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 8 డేస్ కలెక్షన్స్: 54.85కోట్లు (90.75 కోట్లు గ్రాస్)
అఖండ సినిమా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 8 రోజుల్లోనే 54.59 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికే లక్ష్యం కంటే 60 లక్షలు ఎక్కువగా వసూలు చేసింది ఈ సినిమా. అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చింది అఖండ సినిమా.
ఇవి కూడా చదవండి..
Sara Ali Khan | సారా అలీఖాన్‌కు ఏ తెలుగు హీరోతో నటించాలని ఉందో తెలుసా..?
Rajamouli About RRR Hero | ‘ఆర్ఆర్ఆర్’ హీరో ఎవరో చెప్పిన రాజమౌళి
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?