టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కలయికలో వస్తున్న చిత్రం అఖండ. ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూట్ చేసిన పాటతో అఖండ చిత్రీకరణ పూర్తి చేసకుంది. కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చిన షూటింగ్ పూర్తి కావడంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగిపోయారు. బాలకృష్ణ అండ్ టీం వేడుక చేసుకుంది.
డైరెక్టర్ బోయపాటి, బాలకృష్ణ, నిర్మాతలు, హీరోయిన్లు, ఇతర చిత్రయూనిట్ సభ్యులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ ఈ పార్టీలో చిల్ అవుట్ అవుతున్న స్టిల్ ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాలకృష్ణ చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపిస్తుండగా..పక్కనే ఉన్న ప్రగ్యాజైశ్వాల్ హీరోతో కలిసి హ్యాపీ పార్టీ మూడ్లో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అఖండ యూనిట్ పార్టీ ఫొటోలు ఇపుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.
All smiles from the wrap up party of #Akhanda #NandamuriBalakrishna #BoyapatiSrinu #BB3 #MiryalaRavinderReddy @MusicThaman @ItsMePragya @dwarakacreation #Akhanda Roaring Soon 🦁 pic.twitter.com/nCKVuBPz22
— BA Raju's Team (@baraju_SuperHit) October 6, 2021
అఖండ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామనే దానిపై మేకర్స్ స్పష్టత ఇవ్వనున్నారు. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. అఖండలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్ణ మరో ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. బాలకృష్ణ ఈ మూవీలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి