బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో పాటు డివోషనల్, యాక్షన్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ-2: తాండవం’ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను బుధవారం మొదలుపెట్టారు. బాలకృష్ణ పాల్గొనగా రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ‘ఈ నేల అసురుడిది కాదురా..ఈశ్వరుడిది..పరమేశ్వరుడిది..కాదని తాకితే జరిగేది తాండవం. అఖండ తాండవం’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్, సమర్పణ: తేజస్విని నందమూరి, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.