VidaaMuyarchi Second Single | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి విదాముయార్చి (Vidaa Muyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఏకే 62గా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ రానే వచ్చింది.
ఈ మూవీ నుంచి Pathikichu లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు. స్టైలిష్ యాక్షన్ పార్టు థీమ్‌తో సాగుతున్న ఈ ట్రాక్ అజిత్‌కుమార్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పించేలా సాగుతుంది. విష్ణు ఎడవన్, అమోఘ్ బాలాజీ రాసిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్, యోగి శేఖర్ పాడారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్ర పోషిస్తుండగా.. రెజీనా కసాండ్రా, ఆరవ్ మరో కీ రోల్స్‌లో నటిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే విదాముయార్చి నుంచి షేర్ చేసిన పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
అజిత్ కుమార్ దీంతోపాటు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63 కూడా చేస్తున్నాడని తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీని జనవరి 31న కానీ లేదా ఫిబ్రవరి 7న కానీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తుండగా.. మేకర్స్ నుంచి రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
విదాముయార్చి సెకండ్ సింగిల్..
Court Movie | నాని ప్రోడక్షన్లో ప్రియదర్శి ‘కోర్టు’.. విడుదల తేదీ ఖరారు.!