VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) మగిజ్ తిరుమేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం విదాముయార్చి (Vidaa Muyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. తాజాగా సెన్సార్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. విదాముయార్చి రన్ టైం 2 గంటల 30 నిమిషాల 46 సెకన్లు. ఇంకేంటి మరి థియేటర్లలో ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా, ఆరవ్ కీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రెజీనా కసాండ్రా మరో కీ రోల్లో మెరవనుంది. ఇప్పటికే విదాముయార్చి నుంచి షేర్ చేసిన ఆయా పాత్రలకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63గా వస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఇటీవలే కొత్త లుక్ కూడా షేర్ చేశారు.
#VidaaMuyarachi CBFC Report.
Duration: 2hrs 30mins 46secs
Certified: U/A 16+ pic.twitter.com/68IeZfUpeG— Karthik Ravivarma (@Karthikravivarm) January 9, 2025
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య