Ilaiyaraaja | తమిళ హీరో అజిత్ (Ajith) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రంలో తన అనుమతి లేకుండా మూడు పాటలను రీక్రియేట్ చేశారంటూ ప్రముఖ సంగీత దర్శకుడు (Music maestro) ఇళయరాజా (Ilaiyaraaja) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ఇళయరాజా పంపిన లీగల్ నోటీసులపై నిర్మాణ సంస్థ తాజాగా స్పందించింది.
ఆయా పాటలను వినియోగించే ముందు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ తీసుకున్నామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ (Yalamanchili Ravi Shankar) తెలిపారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఉపయోగించిన అన్ని పాటలకు మ్యూజిక్ కంపెనీల నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఈ విషయంలో ప్రొటోకాల్ ఫాలో అయ్యాము. చట్టప్రకారమే పనులు చేశాము’ అని తెలిపారు.
కాగా, తమిళ హీరో అజిత్ (Ajith) నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). దర్శకుడు అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తెరకెక్కించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో గతంలో తాను స్వరపరిచిన మూడు పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారంటూ ప్రముఖ సంగీత దర్శకుడు (Music maestro) ఇళయరాజా (Ilaiyaraaja) ఆరోపించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపారు.
‘నాట్టుపుర పట్టు’ అనే తమిళ చిత్రం నుంచి ‘ఓథ రుబాయుమ్ తేరెన్’, ‘సకలకళా వల్లవన్’ అనే తమిళ చిత్రం నుంచి ‘ఇలమై ఇధో ఇధో’ పాట, ‘విక్రమ్’ చిత్రంలోని ‘ఎన్ జోడి మంజ కురువి’ పాటలను తన అనుమతి లేకుండా రీ క్రియేట్ చేసి అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో వాడారని తెలిపారు. అందుకుగానూ రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సినిమాలో ఆ సాంగ్స్‌ను వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇళయరాజా నోటీసులపై నిర్మాణ సంస్థ తాజాగా స్పష్టతనిచ్చింది. మరోవైపు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు ఇతక కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
OG Movie First Single | పవన్ కల్యాణ్ ‘OG’ ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్ ఇచ్చిన థమన్