OG Movie Hungry Cheetah | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఒక వీడియో గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు, దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. పవన్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా అభిమానులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ కేరింతలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎస్. తమన్ తాజాగా ఓ ఈవెంట్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఓ ఈవెంట్లో మాట్లాడిన తమన్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గతంలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, మిగిలిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. అంతేకాదు, పవన్ కల్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజున అభిమానులకు గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ ఒజాస్ అనే పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు.