Ajith Kumar Vs Prabhas | బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ అంటే.. అందులోనా గ్లోబల్ స్టార్డమ్ ఉన్న ప్రభాస్ (Prabhas)కు దక్షిణాదిన సూపర్ ఫాలోయింగ్ అజిత్‌కుమార్ (Ajith kumar) మధ్య అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి బరిలోకి దిగుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు.
అజిత్ కుమార్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ ఒకటి షేర్ చేశారు.
కాగా ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ కూడా ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్లోబల్ స్టార్డమ్ ఉన్న ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని తెలిసిందే. మరోవైపు అజిత్‌కుమార్‌కు తమిళంలో ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఇక తెలుగులో కూడా గుడ్ బ్యాడ్ అగ్లీని భారీ స్థాయిలో విడుదల చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ప్రభాస్, అజిత్‌కుమార్ మధ్య ఎలాంటి ఫైట్ ఉండబోతున్నదన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Toxic | హాలీవుడ్ స్టైల్లో యశ్ బాస్.. టాక్సిక్ ఫస్ట్ లుక్ లాంచ్ టైం ఫిక్స్
Maharaja | చైనా బాక్సాఫీస్నూ వదలని విజయ్‌సేతుపతి.. మహారాజ అరుదైన రికార్డ్
Pushpa 2 The Rule | బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఇవే