Valimai new Release Date | కరోనా కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. అందులో అజిత్ హీరోగా నటించిన వాలిమై కూడా ఉంది. సంక్రాంతికి రావాల్సిన ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి. పండక్కి బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు జరుగుతుంది అనుకున్న బిజినెస్ కాస్తా 100 కోట్లకు పడిపోయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాట కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో.. అజిత్ హీరోగా నటించిన వాలిమై సినిమా వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. సీహెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాను ఒకేరోజు తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు.
జనవరి 13న సినిమా విడుదల అవుతుందని కన్ఫార్మ్ కూడా చేశారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోవటంతో నిర్మాతలు సినిమాను వాయిదా వేసేశారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. అయితే మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. దానికి సంబంధించిన ఒక డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మార్చి 4న వాలిమై సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఆరోజు తమిళంలో ఎలాంటి సినిమాలు విడుదల కావడం లేదు. దాంతో సోలో రిలీజ్ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
పెద్ద సినిమా కావడంతో సోలో రిలీజ్ ఉంటే కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయని వాళ్ల ఆలోచన. ఇప్పటికే ప్రమోషన్ బాగానే చేసుకున్నారు. ఒకవేళ మార్చి 4న సినిమా వస్తే విడుదలకు వారం ముందు మరోసారి ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని పూర్తి చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఏదేమైనా ఈ సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. మరి ఈ సినిమాతో అజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్గా నటించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
అజిత్ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకేం దొరకలేదా..?
అజిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తికేయ..
‘ భీమ్లా నాయక్ ‘కు గుడ్ న్యూస్.. ఏపీలో పెరగనున్న టికెట్ ధరలు..?
ఎన్టీఆర్కు జోడీగా జాన్వీకపూర్.. ఇందులో నిజమెంత?