కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ధనుష్ (Dhanush), తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (Aishwarya)కు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ధనుష్-ఐశ్వర్య (Dhanush-Aishwarya)18 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు ప్రకటించడంతో టాక్ ఆఫ్ దిటౌన్గా మారిపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలున్నాయంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. దీంతో ఇటీవలే తన మాజీ భార్య ఐశ్వర్య డైరెక్టర్‌గా మారుతున్న సందర్భంగా ధనుష్ విషెస్ చెప్పి ఆ పుకార్లను బ్రేక్ పెట్టేశాడు.
ఐష్ కూడా రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరు భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలుసుంటారని ఈ ట్వీట్స్ తో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆసక్తికర విషయమేంటంటే ఇద్దరూ ట్వీట్స్ చేసుకునేటపుడు ఐశ్వర్య ట్విటర్ హ్యాండిల్లో ఐశ్వర్యధనుష్ అనే పేరు ఉంది. అయితే ఈ పేరును ఇపుడు పూర్తిగా తొలగించేసింది ఐశ్వర్య. మరి మునుపటిలాగే తన తండ్రి పేరును యాడ్ చేస్తూ..ఐశ్వర్యరజనీకాంత్ (Aishwarya Rajinikanth) అని పెట్టుకుంది.
Sister selfie …side n slide 😂👭 pic.twitter.com/fW1yob0agd
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) March 22, 2022
ఐశ్వర్య పాయని (Payani music video) అనే మ్యూజిక్ వీడియోతో డైరెక్టర్‌గా కమ్ బ్యాక్ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు ధనుష్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో సార్ అనే సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్యరజనీకాంత్ న్యూ లుక్‌తో తన సోదరి సౌందర్య రజనీకాంత్‌తో కలిసి దిగిన ఓస్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్చేస్తోంది.