Agra Movie – Ruhani Sharma | ‘చిలసౌ’, ‘హిట్’ చిత్రాల ఫేమ్ టాలీవుడ్ నటి రుహానీ శర్మ నటించిన అవార్డు విన్నింగ్ చిత్రం ఆగ్రా(Agra). అంతర్జాతీయ అవార్డులతో పలు వివాదలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 2023లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్పెషల్ అప్లాజ్ అందుకుంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఇండియాలో ఈ సినిమా విడుదలకు అనుమతి లేకపోవడంతో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రెంచ్ భాషలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇండియాలో పైరసీ వెబ్‌సైట్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఉన్న కథను చూడకుండా రుహాణి నటించిన బోల్డ్ సీన్స్‌ను మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై రుహాణి శర్మ ఒక ఎమోషనల్ నోట్ పెట్టింది.
అందరికి నమస్కారం. నేను నటించిన‘ఆగ్రా’ సినిమాలోని సన్నివేశాలు లీక్ అయినప్పటినుంచి నేను ఎంతో బాధలో ఉన్నాను. నా బాధను వివరించడానికి నిరుత్సాహం అనేది కూడా చిన్నమాటే. మా కష్టాన్ని, అంకితభావాన్ని విస్మరించి కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే వైరల్ చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. ఆర్ట్ ఫిల్మ్‌ను రూపొందించడం అనేది లెక్కలేనన్ని సవాళ్లతో పాటు నిద్రలేని రాత్రులతో కూడుకున్న పని. అలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రక్తాన్ని చెమటగా మార్చాలి.
మా కష్టాన్ని, కన్నీళ్లను అర్థం చేసుకోకుండా కొందరు దానిగురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆగ్రా కేవలం ఒక చిత్రం కాదు. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శించారు. అది మా యూనిట్ కు దక్కిన గౌరవం. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడమే కాకుండా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇంత గొప్ప సినిమాలో నటించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఈ సినిమా శైలిని అందరూ గుర్తించాలని కోరుతున్నాను. కళ ఎప్పుడూ సులభంగా, సౌకర్యవంతంగా ఉండదు. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కళాకారుల శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని చూడండి’ అని ఎక్స్‌లో స్పెషల్ నోట్ పెట్టింది రుహాణి. ఇక ఆగ్రా సినిమాను కనుబెల్ తెరకెక్కించగా మోహిత్ అగర్వాల్ (Mohit Agarwal) హీరోగా నటించాడు. రుహానీ శర్మ (Ruhani Sharma), అంచల్ గో స్వామి (Aanchal Goswami), ప్రియాంకా బోస్ (Priyanka Bose) కీలక పాత్రల్లో నటించారు.
— Ruhani Sharma (@iRuhaniSharma) August 24, 2024
రుహానీ శర్మ సినిమాల విషయానికి వస్తే.. తమిళ దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో ఒక మూవీ తెరకెక్కబోతుండగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఈ భామ. మాస్క్ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో కవిన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. వెట్రి మారన్ శిష్యుడు విక్రనన్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read..