బెంగుళూరు: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఛార్జ్‌షీట్(Charge Sheet) దాఖలు చేసింది. ప్రజ్వల్‌పై సిట్ నాలుగు కేసులను విచారిస్తున్నది. సుమారు రెండు వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సిట్ చెప్పింది. దీని కోసం 150 మంది సాక్ష్యులను విచారించారు. ఇంట్లో పనిమనిషిపై లైంగిక దాడి జరిగినట్లు నమోదు చేసిన కేసులో ఛార్జీషీట్ ను సిట్ సమర్పించింది. స్పాట్ ఇన్స్పెక్షన్, బయోలాజికల్, ఫిజికల్, సైంటిఫిక్, మొబైల్, డిజిటల్, ఇతర ఆధారాలను సేకరించినట్లు సిట్ తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ముందు నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నట్లు కూడా సిట్ వెల్లడించింది.
మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ కుమారుడు ఎమ్మెల్యే రేవణ్ణపై ఐపీసీలోని సెక్షన్ 354, 354(ఏ) కేసులను నమోదు చేశారు. ప్రజ్వల్‌పై 376, 376(2)(కే), 354, 354(ఏ), 354(బీ) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఓ పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.