Janhvi Kapoor | గుజరాత్ వడోదరలో ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. కరేలిబాగ్ ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లా స్టూడెంట్ రక్షిత్ చౌరాసియా (20) అనే నిందితుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ వచ్చి.. నియంత్రణ కోల్పోయి పాదచారులను ఢీకొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఈ ఘటనపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన చాలా భయానకంగా ఉందని.. ఎవరైనా ఇలా ఎలా ప్రవరిస్తారంటూ మండిపడింది. ప్రమాదం బాధ కలిగించిందని.. సదరు వ్యక్తి తాగి ఉన్నా లేకపోయినా.. సహించలేమని స్పష్టం చేసింది. జాన్వీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాన్వీ వ్యాఖ్యలతో పలువురు ఏకీభవించారు.
ఈ ఘటనపై లా స్టూడెంట్ రక్షిత్ చౌదరి స్పందించాడు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో లేనని తెలిపాడు. గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు ఆ స్కూటీ కంటే ముందుగా వెళ్తుందని.. తాను రైట్ సైడ్ తీసుకున్నానని.. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉందని.. కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న స్కూటీని ఢీకొట్టిందని చెప్పారు. ఆ తర్వాత కార్ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యిందని.. తర్వాత ఏం జరిగిందని తనకు తెలియని.. ఘటన జరిగిన సమయంలో 50 కిలోమీటర్ల స్పీడ్‌లోనే వెళ్తుందని చెప్పారు. తాను మద్యం తాగలేదని.. హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రమాదంలో రక్షిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాగి ఉన్నాడో.. లేడో తేల్చేందుకు వైద్య పరీక్షలు చేయించనున్నారు.