‘పుష్ప’ తొలి భాగం ఘన విజయం తర్వాత రష్మిక మందన్న క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఈ క్రేజ్‌తో బాలీవుడ్లో పలు ఆసక్తికర చిత్రాల్లో నటిస్తున్నదామె. సినిమాలతో పాటు ఆమెకు ఫ్యాషన్ షోలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు అందుతున్నాయి.
ఇప్పటిదాకా ఆమె ఈషోస్లో పాల్గొనలేదు. తొలిసారి ఢిల్లీలో జరిగిన ఐసీబ్ల్యూ ప్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఈ వేదిక మీద ఆమె తన నడకల స్టైల్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ..‘తొలిసారి ప్యాషన్ షోలో పాల్గొనడం సంతోషంగా ఉంది.
ఇప్పటిదాకా నేను ర్యాంప్ వాక్ చేయలేదు. ఇది నాకు తొలి అనుభవం. సంప్రదాయంగా కనిపిస్తూనే ఆధునికంగా డిజైన్ చేసిన దుస్తులు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి’ అని చెప్పింది. రష్మికకు ప్రస్తుతం తీరిక లేనన్ని సినిమాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’, అమితాబ్ బచ్చన్ సినిమా ‘గుడ్ బై’, సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా ‘మిషన్ మంజూ’, తమిళ హీరో విజయ్‌తో ‘వారసుడు’, రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది.