Liger Movie Talk | ఒకప్పుడు పూరీ జగన్నాథ్ ( Puri Jagannadh ) సినిమా వచ్చింది అంటే టాక్‌తో సంబంధం లేకుండా అభిమానులు చూసేవాళ్లు. సినిమా బాగున్నా బాగోలేకపోయినా హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం అదిరిపోయేది. కేవలం దానికోసమే థియేటర్‌కి వెళ్లే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, పైసా వసూల్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. కానీ వాటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దానికి కారణం అందులో హీరో క్యారెక్టరైజేషన్.. దాన్ని పూరీ జగన్నాథ్ డిజైన్ చేసిన తీరు. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అందులోని డైలాగులు అదిరిపోయేవి. కానీ మొట్ట మొదటిసారి కెరీర్లో అటు డైలాగులు లేక.. ఇటు క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేక లైగర్ ఎటు కాకుండా పోయింది.
పూరీ జగన్నాథ్ బలం డైలాగులు.. ఆయన మాస్ పంచ్ డైలాగులు హీరో చెప్తుంటే థియేటర్లో ఈలలు గోలలు పడుతుంటాయి. కానీ లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు నత్తి పెట్టి తన బలాన్ని తనే చంపేసుకున్నాడు పూరీ. పోనీ హీరో క్యారెక్టరైజేషన్ ఇంతకు ముందు సినిమాల మాదిరి బలంగా ఉందా అంటే అదీ లేదు. అసలు కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమా చేసింది నిజంగా పూరీ జగన్నాథేనా అనే అనుమానం కూడా వస్తుంది అంటున్నారు అభిమానులు. లైగర్‌తో పాన్ ఇండియా స్థాయిలో రఫ్ఫాడిస్తాడు అనుకుంటే అసలుకే మోసం తీసుకొచ్చాడు అంటూ పూరీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
ఎప్పుడో పదేళ్ల కింద రాసుకున్న కథ అంటూ పూరీ ముందే చెప్పాడు. అయితే దానికి ట్రీట్మెంట్ కూడా అలాగే ఇవ్వడంతో ఏమాత్రం కొత్తదనం లేకుండా తయారయ్యింది లైగర్. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టిన కూడా పస లేని కథ ముందు అది కూడా తేలిపోయింది. ఏదేమైనా భారీ ఆశలు పెట్టుకున్న పూరీ అండ్ బ్యాచ్‌కు ఇది మామూలు షాక్ కాదు. దీని నుంచి కోలుకొని జనగణమన సినిమా అయినా పర్ఫెక్ట్గా తీయాలని కోరుకుంటున్నారు పూరీ ఫ్యాన్స్.
Liger Movie Review | లైగర్ సినిమా రివ్యూ”