Mrunal Thakur | సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మరాఠి ముద్దుగుమ్మ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో మెరిసింది. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) కాంపౌండ్ నుంచి వస్తున్న డెకాయిట్ (Dacoit)లో హీరోయిన్గా నటిస్తోంది. షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
కాగా సెట్స్‌లో మృణాళ్ ఠాకూర్‌ను టీం మెంబర్స్ సర్ప్రైజ్ చేశారు. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా..? ఆగస్టు 1న మృణాళ్ ఠాకూర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే అడివిశేష్ టీం సెట్స్‌లో ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. సెట్స్‌లో మృణాళ్ ఠాకూర్‌తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రేపు స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
డెకాయిట్ టీం పోస్టర్లో మృణాల్ ఠాకూర్ ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. మరోచేతిలో పిస్తోల్ పట్టుకొని కనిపిస్తుండగా.. పక్కనే అడివి శేష్ సిగరెట్ వెలిగిస్తున్నాడు. డెకాయిట్‌లో హీరోహీరోయిన్లిద్దరూ ఏదో మిషన్‌లో పాల్గొంటున్నట్టుగాఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
A pre-birthday bash for the charming @mrunal0801 planned by team #Dacoit on the sets 🥳🎂
A super surprise for the birthday girl ✨
Stay tuned for a special poster dropping tomorrow 😍#DACOIT IN CINEMAS WORLDWIDE ON DECEMBER 25th 💥#DacoitFromDec25th@AdiviSesh @mrunal0801… pic.twitter.com/gH3vivt5w5
— BA Raju’s Team (@baraju_SuperHit) July 30, 2025
Madhira : బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : చిత్తారు నాగేశ్వర్రావు