Hit-2 Movie | మొదటి నుండి కంటెంట్ ప్రధానమున్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివిశేష్. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అడివిశేష్ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకులు భావిస్తుంటారు. ఇటీవలే ‘మేజర్’తో అడివిశేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంభై దాడుల్లో అమర వీరుడైన సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈయన ‘హిట్’ సీక్వెల్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ చిత్రం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ అడివిశేష్ ‘మేజర్’తో బిజీ ఉండటంతో షూటింగ్ కాస్త లేట్ అయింది.
తాజాగా అడివిశేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హిట్-2’ ఫైనల్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభంకానుందంటూ.. ఓ ఫోటోను విడుదల చేశాడు. ఈ ఫోటోలో శేష్ చేతిలో గన్ పట్టుకుని ఇంటెన్సీవ్‌గా చూస్తున్నాడు. ఈ చిత్రంలో శేష్‌కు జోడీగా ‘ఖిలాడీ’ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంత్ తిపిర్నేని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. దీనితో పాటుగా అడివిశేష్ ‘గూఢచారి-2’ ను కూడా సెట్స్‌పైన ఉంచాడు. తర్వలోనే ఈ చిత్రం షూటింగ్‌ను మొదలు పెట్టనుంది. ఇక ఇటీవలే ఈ చిత్ర సీక్వెల్లో కీలకపాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించగా.. తను నో చెప్పినట్లు శేష్ తెలిపాడు.
Read Also:
Viruman Movie | షెడ్యూల్ కంటే ముందే థియేటర్లలో.. సందడి చేయనున్న కార్తి మూవీ
Hanu Raghavapudi | అవకాశం వస్తే హను రాఘవపూడికి ఆ ఫ్లాప్ సినిమాను మళ్లీ తీయాలనుందట..!
Liger Movie | భారీ ధరకు ‘లైగర్’ శాటిలైట్-డిజిటల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Cobra Movie | ‘కోబ్రా’లో ఏడు పాత్రల్లో కనిపించనున్న విక్రమ్?