Liger Movie | భారీ ధరకు ‘లైగర్’ శాటిలైట్-డిజిటల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Liger Movie Non-Theatrical Rights | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. వీళ్ళ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పటి ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ట్రైలర్లో విజయ్ మాస్ మేకోవర్ ప్రేక్షకులను ఫిదా చేసింది. కేవలం ట్రైలర్‌తోనే మేకర్స్ విధ్వంసం సృష్టించారు. ఇప్పటివరకు లైగర్ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
లైగర్ సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ దిగ్గజ సంస్థ స్టార్ గ్రూప్ రూ.55 కోట్లకు లైగర్ డిజిటల్. శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది. ఓ టైర్2 హీరోకు ఈ రెంజ్లో బిజినెస్ జరుగుతుందంటే విశేషం అనే చెప్పాలి. పైగా విజయ్ నటించిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇక ‘లైగర్’ విషయానికొస్తే ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Vijay Deverakonda’s #Liger satellite and digital rights bagged by Star group for ₹55 crores.
— Lets Cinema (@letscinema) July 22, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

