Karthi’s Sardar 2 OTT | కార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘సర్దార్ 2’ (Sardar 2) ఎట్టకేలకు డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ రెండవ భాగంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో కార్తీ (Karthi) మరోసారి ద్విపాత్రాభినయంతో అదరగొట్టారు.
ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య (SJ Suryah) పవర్ఫుల్ పాత్రలో కనిపించగా, మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), రజీషా విజయన్ (Rajisha Vijayan) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.