Viruman Movie | షెడ్యూల్ కంటే ముందే థియేటర్లలో.. సందడి చేయనున్న కార్తి మూవీ
Viruman Movie Pre-Poned | తమిళ స్టార్ కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుంచి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలయ్యాయి. తెలుగులో ఈయన సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగ్గజ దర్శకుడు శంకర్ కూతురు అధితి హీరోయిన్గా నటించింది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నిముందుగా వినాయక చతుర్థి సందర్భంగా ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్నిమూడు వారాలు ముందుగా.. ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇదే రోజున విక్రమ్ నటించిన ‘కోబ్రా’ విడుదల కావాల్సి ఉంది. కానీ సీజి వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో కోబ్రా పోస్ట్ పోన్ కానుంది. దాంతో ‘కోబ్రా’ డేట్ను ‘విరుమన్’ రిప్లేస్ చేస్తుందని సమాచారం. ఇక విరుమన్ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరపుకుంటుంది. ప్రస్తుతం కార్తి, పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. వీటీతో పాటుగా మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నీయున్ సెల్వన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
Read Also:
Hanu Raghavapudi | అవకాశం వస్తే హను రాఘవపూడికి ఆ ఫ్లాప్ సినిమాను మళ్లీ తీయాలనుందట..!
Liger Movie | భారీ ధరకు ‘లైగర్’ శాటిలైట్-డిజిటల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Bandla Ganesh | ట్విట్టర్లో బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్.. ఆ టాలీవుడ్ హీరోను ఉద్దేశించేనా?
Cobra Movie | ‘కోబ్రా’లో ఏడు పాత్రల్లో కనిపించనున్న విక్రమ్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

