Hanu Raghavapudi | అవకాశం వస్తే హను రాఘవపూడికి ఆ ఫ్లాప్ సినిమాను మళ్లీ తీయాలనుందట..!
Sita Ramam Promotions | ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే దర్శకులలో హను రాఘవపూడి ఒకరు. ‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హను.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. మంచి ఫీల్‌తో ప్రేమకథలను తెరకెక్కించే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దుల్కర్ సల్మాన్‌తో ‘సీతారామం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో హను రాఘవపూడి ప్రమోషన్లను స్టార్ట్ చేశాడు. ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో ‘లై’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన సినిమాలలో లైకు బాగా కష్టపడ్డానని.. అవకాశం వస్తే లై సినిమాను మళ్లీ తీయాలని ఉందని తెలిపాడు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఈ సనిమా ఫేయిల్యూర్కు ముఖ్య కారణం విడుదల తేది. ఎందుకంటే అదే రోజున రానా ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జయ జానకి నాయక’ సినిమాలు పోటీగా విడుదలయ్యాయి. అప్పుడు ఈ రెండు చిత్రాలకు విపరీతమైన బజ్ ఉంది. పైగా ఈ రెండు సినిమాలు యాక్షన్ జోనర్లో తెరకెక్కినవి. అయితే ‘లై’ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా అర్థం కాలేదు. దాంతో ఫ్లాప్‌గా మిగిలింది.
ఇక సీతారామం సినిమా గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. సీతారామం కథ 1965 బ్రాక్ డ్రాప్లో నడిస్తుందని.. సీతకోసం రాముడు పడే సంఘర్షణలోంచి ఈ కథ పుట్టిందని చెప్పుకొచ్చాడు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది.
Read Also:
Suriya | సూర్య ‘వాడివసల్’ బిగ్ అప్డేట్..!
Liger Movie | భారీ ధరకు ‘లైగర్’ శాటిలైట్-డిజిటల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Bandla Ganesh | ట్విట్టర్లో బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్.. ఆ టాలీవుడ్ హీరోను ఉద్దేశించేనా?
Cobra Movie | ‘కోబ్రా’లో ఏడు పాత్రల్లో కనిపించనున్న విక్రమ్?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

