Suriya | సూర్య ‘వాడివసల్’ బిగ్ అప్డేట్..!
Vaadivasal Movie | తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘గజిని’ సినిమాతోనే తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో తెలుగులో ఈయనకు విపరీతమైన క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘వాడివసల్’ ఒకటి. ‘విసరనై’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి వినూత్న చిత్రాలను తెరకెక్కించిన వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వీళ్ళ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవలే సూర్యకు లుక్ టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే.
శనివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ వీడియోను శనివారం సాయంత్రం 5.30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. జీ.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ఆండ్రియా జెరేమియా హీరోయిన్గా నటిస్తుంది. సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో ‘అచలుడు’ సినిమాలో నటిస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. లేటెస్ట్గా సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు.
On the occasion of National Award winner @Suriya_offl's birthday, Team #Vaadivasal will be releasing a small glimpse of the training footage today at 5:30 pm.🔥😎👍🏼
Watch this space! #HBDSuriya @thevcreations @VetriMaaran pic.twitter.com/9RunBKZv3h
— Sreedhar Pillai (@sri50) July 23, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

