నగోయా: ఏషియన్ గేమ్స్(Asian Games)లో బిగ్ క్లాష్ జరగనున్నది. టీ20 సమరంలో దాయాదులు పాకిస్థాన్, భారత్ శనివారం తలపడనున్నాయి. ఇవాళ జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో భారత్ జట్టు 124 రన్స్ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. జపాన్‌లోని నిషిన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసింది. అయితే చేజింగ్‌లో శ్రీలంక చితికిలపడింది. కేవలం 9.5 ఓవర్లలో 45 రన్స్‌కే ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
పరుగులు రాబట్టడం కష్టంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు తొలుత తడబడ్డారు. ఇషాన్ కిషన్ చాకచక్యంగా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 80 రన్స్ చేసి అతను నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో సూర్యవంశీ 38 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 170 టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన శ్రీలంక ఏ దశలోనూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. అయిదుగురు లంక బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఫెర్నాండో ఒక్కడే రెండు అంకెల స్కోరు చేశాడు.
మరో వైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 రన్స్ చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ 11.3 ఓవర్లలో టార్గెట్‌ను అందుకున్నది. అబ్దుల్ సమద్ 30, నవాజ్ 27 రన్స్ చేసి పాక్‌ను గెలిపించారు. ఇక ఇండియా, పాకిస్థాన్ జట్లు శనివారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో పోటీపడనున్నాయి.
📸 𝗠𝗮𝗿𝗰𝗵𝗶𝗻𝗴 𝗶𝗻𝘁𝗼 𝘁𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹 🏅
A commanding 1️⃣2️⃣4️⃣-run victory in the semi-final takes #TeamIndia into the Gold Medal match on Saturday 🇮🇳
Scorecard ▶️ https://t.co/DjHV9q6htT#AsianGames pic.twitter.com/kr6h7UlyyG
— BCCI (@BCCI) October 1, 2026