అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్లో క్లాసిక్‌గా చెప్పుకునే సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో.. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో.. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రత్యేకంగా అభిమానులున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 11న మళ్లీ గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఈ విషయాన్ని మంగళవారం ఓ ప్రకటన ద్వారా ఆయన తెలియజేశారు. ‘34ఏండ్ల క్రితం జూలై 18, 1991న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. మనదేశంలో వచ్చిన తొలి టైమ్ ట్రావెల్ ఫిక్షన్ మూవీ ఇది. ఈ క్లాసిక్ నిర్మాణానికి సహకరించిన ఎస్పీబాలుగారికి, బాలకృష్ణగారికీ, సింగీతంగారికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. పి.సి.శ్రీరామ్, వి.ఎస్.ఆర్.స్వామి, కబీర్‌లాల్.. ఈ ముగ్గురు దిగ్గజ డీవోపీలు ఈ సినిమాకు పనిచేశారు. కృష్ణకుమార్, కృష్ణదేవరాయలుగా ద్విపాత్రాభినయం చేసి నట విశ్వరూపం చూపించారు బాలయ్య. సింగీతం దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, మోహిని, సిల్క్ స్మితల అందచందాలు, అమ్రీష్‌పురి అభినయం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఈ సినిమాను 4కె డిజిటల్ చేశాం. సౌండ్‌ని కూడా 5.1 క్వాలిటీకి కన్వర్ట్ చేశాం. ప్రసాద్ టిజిటల్ టీమ్ ఆరు నెలలు శ్రమించి చక్కని అవుట్‌పుట్ ఇచ్చారు. రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న నేటి తరుణంలో తప్పకుండా ఈ తరం ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని మా నమ్మకం’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్.