మొదటి పార్టులాగే ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) . కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ఈ మూవీ బాక్సాపీస్‌ను షేక్ చేయడం ఖాయమని తొలి రోజు థియేటర్ల వద్ద వస్తున్న స్పందన చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర అధీరా (Adheera). బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt) పోషించిన నెగెటివ్ రోల్ అధీరా సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ పాత్ర కోసం కఠినమైన ఫిట్నెస్ మెలకువలను నేర్చుకున్నట్టు చెప్పాడు మున్నాభాయ్. హీరోకు వ్యతిరేకంగా కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో భయానకంగా కనిపించాలంటే..తీవ్రమైన యాక్టింగ్ మాత్రమే కాకుండా..అందరూ నమ్మదగిన శరీర సౌష్టవం కూడా అవసరం. సింపుల్‌గా చెప్పాలంటే నేను ఆ పాత్రను పోషించడం కాదు..అందులో లీనమవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. సడక్ 2 సినిమా విడుదలకు ముందు 2020లో సంజయ్‌దత్ క్యాన్సర్ బారిన పడినట్టు నిర్దారణ అయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత విదేశాల్లో చికిత్స కూడా చేయించుకున్నాడు. సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉండటంతో చికిత్స తర్వాత సంజయ్ దత్ అడాప్ట్ చేసుకున్న ఫిట్నెస్ పార్టు చాలా కష్టంగా ఉండేదట. ఫిట్నెస్ శిక్షణ చాలా కష్టంగా ఉండేది..కానీ నేను సినిమా చూసిన తర్వాత ఇది సినిమాకు చాలా విలువైనదనిపించిందని చెప్పాడు సంజయ్ దత్.