Vikram Movie | తమిళ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తుంది. తాజాగా చిత్రబృందం మరో బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ చిత్రంలోని ‘అధీరా’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ తెలుగు వెర్షన్‌ను సోమవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే తమిళంలో ఈ సాంగ్ ఛార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఏ.ఆర్ రెహామాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్రముఖ దిగ్గజ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం విక్రమ్ నటించిన మరో చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. లేజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా నటించాడు. ఇటీవలే విడుదలైన విక్రమ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
Euphonic #Adheeraa Telugu Lyrical song from #ChiyaanVikram's #Cobra releasing TOMORROW @ 6 PM💃🏻🕺🏻
An @arrahman Musical
Grand Release on Aug 11th✨@AjayGnanamuthu @7ScreenStudio @IrfanPathan @SrinidhiShetty7 @roshanmathew22@NVR_CinemaOffl @SonyMusicSouth#CobraFromAugust11🐍 pic.twitter.com/m4P5AgcKsC
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 17, 2022
Read ALso:
Kamal Haasan | ‘కబాలి’ దర్శకుడితో కమల్‌హాసన్ నెక్స్ట్ సినిమా
RRR Movie | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడి ప్రశంసలు
Agent Movie | ‘ఏజెంట్’ టీజర్‌పై మహేష్‌బాబు ప్రశంసలు.. థాంక్యూ బ్రదర్ అంటూ అఖిల్ రీట్వీట్
Sita Ramam Movie | సిరివెన్నెల రచించిన ‘కానున్న కళ్యాణం’ ప్రోమో రిలీజ్