‘పెదకాపు-1’ చిత్రం నటిగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని చెప్పింది కథానాయిక ప్రగతి శ్రీవాస్తవ. విరాట్‌కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రగతి శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘తెలుగులో నా రెండో చిత్రమిది.
‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో కథానాయికల పాత్రలు సంఘర్షణతో సాగుతాయి. అదే తరహాలో ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ ఎమోషన్స్‌తో ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలోనే రూరల్ బ్యాక్‌డ్రాప్ పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. సమంత, తాప్సీ నా అభిమాన నాయికలు. తెలుగులో ప్రభాస్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్‌లతో నటించాలనుంది. భవిష్యత్తులో ఛాలెంజింగ్ రోల్స్ ద్వారా నా ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నా’ అని చెప్పింది.