Actress Hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బుధవారం జరిగిన ‘మా’ సమావేశంలో హేమ సస్పెన్షన్ విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. హేమను సస్పెండ్ చేసే అంశంలో సభ్యుల అభిప్రాయాలను కోరారని, గురువారం తుది నిర్ణయం తీసుబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ జరగడంతో ‘మా’ సస్పెన్షన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. క్లీన్‌చీట్ వచ్చేంతవరకు హేమను సస్పెన్షన్‌లోనే ఉంచాలన్నది సభ్యుల అభిప్రాయమని చెబుతున్నారు. సస్పెన్షన్ విషయంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం అధికారిక ప్రకటన చేయబోతున్నారని సమాచారం.