Actress| ఇటీవల కాలంలో దుర్మార్గుల ఆగడాలు ఎక్కువయ్యాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా లైంగిక దాడులకి పాల్పడుతున్నారు. షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటిపై లైంగిక దాడి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కి చెందిన మహిళ బాలీవుడ్ నటిని తమ షాప్ ఓపెనింగ్‌కి ఆహ్వానించిందట. ఓపెనింగ్ కోసం వచ్చిన ఆమెకి తగు పారితోషికం, ఛార్జీలు అన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చిందట. అయితే ముంబయిలో ఉంటున్న సదరు బాలీవుడ్ నటి హైదరాబాద్‌కి రాగా, ఆమెకు మాసబ్‌ట్యాంక్ శ్యామ్ నగర్‌కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో బస ఏర్పాటు చేశారు.
ఆ రోజు రాత్రి ఆమె కంగుతినే ఘటన ఎదురైంది. ఆమె బస చేసిన అపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఆమె రూమ్‌లోకి చొరబడి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారట. అయితే ఆ నటి ప్రతిఘటించడంతో పాటు వెంటనే డయల్ 100కి కాల్ చేసింది. దాంతో నటిని వారు గదిలో బంధించి దాదాపు రూ.50వేల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న మాసబ్ ట్యాంక్ లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు అక్కడ చుట్టు పక్కన ఉన్నసీసీ కెమెరాలని కూడా పరిశీలిస్తున్నారు. అయితే వారు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాధితురాలి వద్ద నుంచి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా ఏదైన కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్లకు సినీ తారలను పిలవడం కామన్. కాని వారితో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి. నిందితులకి కఠిన శిక్షలు వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.