Adah Sharma | ‘మరక మంచిదే!’ అంటూ అదాశర్మ పెట్టిన పోస్ట్.. నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా, ఓ షూట్‌కు సంబంధించిన ఫొటోలను అదాశర్మ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల వెనక కథను చెబుతూ.. ‘నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవాలి. కానీ, త్వరత్వరగా తాగితే.. ఇలాగే మీద పడిపోతాయి. అప్పుడే సూర్యాస్తమయంలో ఫొటోలు తీసుకోవాలి అనుకుంటే.. ఆ దుస్తులను ఆరబెట్టుకునే సమయం కూడా ఉండదు.
అందుకే.. నీళ్లు పడిన మరక కనిపిస్తున్నా.. ఫొటోలు మాత్రం తీసేసుకున్నా. ఎందుకంటే, నాకు సూర్యాస్తమయమే ముఖ్యం’ అంటూ రాసుకొచ్చింది. అయితే, ఫొటోషాప్‌లాంటి సాఫ్ట్వేర్లు ఉపయోగించి ఆ మరకలను తొలగించుకోవచ్చనీ, కానీ, అలా ఉండటమే మంచిదని అనిపించినట్టు కూడా చెప్పుకొచ్చింది.
‘ఈ ఫొటోలను చూసినప్పుడల్లా.. కేర్లెస్గా ఉండకూడదని నాకు గుర్తుకొస్తూ ఉంటుంది’ అని వెల్లడించింది. అదాశర్మ పెట్టిన ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక బాలీవుడ్ నటి అదాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్‌కు జోడీగా.. ‘హార్ట్ ఎటాక్’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ బాటపట్టి.. బాగానే ఆఫర్లు కొట్టేసింది. వరుస సినిమాలతో మంచి పాపులారిటీని దక్కించుకుంది.
‘ద కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ నటిస్తూ.. బిజీగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అదాశర్మ.. తన సినిమాలతోపాటు వ్యక్తిగత విషయాలనూ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.