Vishal | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటారు విశాల్, ధనుష్. ఈ ఇద్దరి మధ్య పోటీ అంటే ఎలా ఉంటుంది. ఈ వార్తే ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విశాల్ హీరోగా సరైన బ్రేక్ అందుకోక చాలా కాలమే అవుతుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు విశాల్. తాజాగా విశాల్ ధనుష్‌తో పోటీ పడబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
అయితే విశాల్ ఈ సారి యాక్టర్‌గా కాకుండా డైరెక్టర్‌గా పోటీలో ఉండబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం మకుటం. మొదట ఈ చిత్రానికి రవి అరసు డైరెక్టర్‌గా ఫైనల్ అయ్యాడు. మకుటం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మకుటం సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు విశాల్. కొన్ని పరిస్థితుల వల్ల తాను దర్శకత్వ బాధ్యతల నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
ఇక తమిళ సినిమాలో యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తున్న వారిలో ధనుష్ టాప్‌లో ఉంటాడని తెలిసిందే. పవర్ పాండి సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చిన ధనుష్.. మళ్లీ చాలా కాలానికి రాయన్‌తో దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లీ కొట్టు సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు. వీటిలో ఇడ్లీ కొట్టు మినహా మిగిలిన సినిమాలన్నీ డైరెక్టర్‌గా ధనుష్ కు మంచి మార్కులే వేశాయి.
కానీ విశాల్ విషయానికొస్తే ఇది భిన్నంగా ఉంటుంది. విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ యావరేజ్ గ్రాస్ సాధించింది. ఆ తర్వాత రత్నం, లాఠి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాయి. విశాల్ ఆశలన్నీ తుప్పరివాలన్ 2పైనే పెట్టగా.. ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మకుటం సినిమాను డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ధనుష్ ఇప్పటికే యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. కానీ విశాల్ మాత్రం మొదటిసారి మెగాఫోన్ పట్టడంతో.. విశాల్‌కు మాత్రం ఇది పెద్ద పరీక్షే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో ధనుష్‌ను అందుకుంటాడా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Deepika Padukone | ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన దీపికా పదుకొణే.. పాప ఎంత క్యూట్‌గా ఉంది.!
Kotha Lokah Movie | ‘కొత్త లోక’ని తెలుగులో తీస్తే డిజాస్టర్ అయ్యేది : నిర్మాత నాగవంశీ