Actor Siddharth | చాలా కాలం తరువాత నటుడు సిద్దార్థ్ ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు అదే ‘భారతీయుడు-2’ (Bharateeyudu 2). కమల్‌హాసన్ నటించిన విజయవంతమైన చిత్రం ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ ఈ నెల 12న విడుదల కానుంది. అయితే ఈ చిత్ర టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా జరిగిన మీట్‌ది ప్రెస్‌లో ఒక విలేఖరి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డ్రగ్స్ క్యాంపెన్స్లో మీరు పాల్గొంటున్నారా? సామాజిక బాధ్యతలో మీ పాత్ర ఏమిటి అని అడగ్గా.. “ప్రతి నటుడికి సామాజిక బాధ్యత వుంటుంది. మా బాధ్యత ప్రకారం మేం పనిచేస్తాం. ఏ ముఖ్యమంత్రి అడిగినా మేం చేస్తాం. మేం చెప్పింది చేస్తేనే మీకు మా సహకారం వుంటుందని ఏ సీఏం చెప్పడు “అంటూ స్పందించాడు. ఈ వ్యాఖ్యలు మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ సమాధానం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తిగా వున్నాడని నిర్మాతలకు తెలియడంతో హుటా హుటిన ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మళ్లీ సిద్దార్థ్‌తో నిర్మాతలు ఓ వీడియో బైట్‌ను సిద్దం చేసి మీడియాకు విడుదల చేశారు.
భారతీయుడు-2 ప్రెస్మీట్లో నా మాటల్ని కొంతమంది అపార్థం చేసుకున్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి నేను పూర్తి సపోర్ట్ అందిస్తాను. ఆయన చేస్తున్న ఇంత మంచి పనికి సహకారం అందించడం మన బాధ్యత. కేవలం ప్రభుత్వాలే కాకుండా అందరూ తమ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలి అని వీడియోలో చెప్పుకొచ్చారు సిద్దార్థ్. అయితే ఈ విషయంలో సిద్దార్థ్ కావాలని ఏ ప్రభుత్వాన్ని, ఎవరిని కించపరచలేదని, ఆ వుద్దేశం కూడా ఆయనకు లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రెస్‌మీట్ ముగించుకుని చెన్నై బయలుదేరిన తరువాత ఫ్లైట్ దిగగానే సిద్దార్థ్చే ఈ వీడియో బైట్‌ను రికార్డ్ చేసి రిలీజ్ చేసి తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడ్డారు నిర్మాతలు.
Also Read..