Arvind krishna | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ అరవింద్ కృష్ణ (Arvind krishna). హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నాడు. ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఆంధ్రాపోరీ, ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సుకు పూర్వజ్ దర్శకత్వంలో ఏ మాస్టర్ పీస్ సినిమా చేస్తున్నాడు అరవింద్ కృష్ణ.
వీగన్ లైఫ్ స్టైల్‌తో తరచూ వార్తల్లో నిలిచే అరవింద్ కృష్ణకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని అందుకున్నాడు. అరవింద్ కృష్ణ రెండేళ్లుగా వీగనరీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్గా ముంబైలో జరిగిన వీగన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆ కాన్క్లేవ్లో ప్యానలిస్టుగా వ్యవహరించింది. ఈవెంట్లో అరవింద్ కృష్ణను వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా పురస్కారంతో సత్కరించారు.
ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. వీగనిజమ్ నేను నమ్మే సిద్దాంతం అన్నాడు. ఈ పురస్కారాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నా. నేను నమ్మిన సిద్దాంతాన్ని ఇష్టంగా, సమర్థవంతంగా ఆచరించేందుకు, నలుగురికి పంచేందుకు ఈ అవార్డు నాలో బలమైన స్ఫూర్తిని నింపుతోందన్నాడు. నటుడిగా, అథ్లెట్‌గా, వీగనిజాన్ని ఫాలో అవుతున్న అరవింద్ కృష్ణ.. వీగనిజమ్ వల్ల అథ్లెట్‌గా, యాక్టర్‌గా మరింత యాక్టివ్‌గా ఉంటున్నానంటున్నాడు అరవింద్ కృష్ణ.
వీగనిజం తనకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని, తన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయన్నాడు. ఇదివరకటితో పోలిస్తే తాను శ్వాసించే విధానంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని.. మంచి ఆలోచన చేయగలుగుతున్నానన్నాడు. దీని వల్ల కథలను ఎంపిక చేసుకోవడం కూడా సులభమవుతుందని చెప్పుకొచ్చాడు అరవింద్ కృష్ణ.
Suriya | ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అక్షయ్‌కుమార్.. సర్ఫీరా ప్రమోషన్స్ టైం
lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్
Polimera 3 | అఫీషియల్ థ్రిల్లింగ్ న్యూస్.. సత్యం రాజేశ్ పొలిమేర 3 వచ్చేస్తుంది