Shivaji | తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగించిన పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మ (iBomma), బప్పం టీవీ (Bapam TV) లను సైబర్ క్రైమ్ పోలీసులు అధికారికంగా మూసివేయించారని తెలిసిందే. ఈ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం అరెస్టు చేసిన పోలీసులు అతనితోనే ఆయా వెబ్సైట్ల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయించినట్లు సమాచారం. కాగా దండోరా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ ఐబొమ్మ రవిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వాడికేదో బాధ.. మొత్తానికి వాడిని పట్టేశారు. కానీ ఆ అబ్బాయి మంచి హ్యాకర్ అని విన్నాను. ఆ అబ్బాయిని మంచి పని కోసం వాడుకోవాలని కోరుకుంటున్నా. అతడు కనీసం ఇక నుంచి మారి దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుందన్నాడు శివాజీ. టాలెంట్ ఎవడి సొత్తు కాదండి. అతను నిరూపించాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే.. అతని టాలెంట్ గురించి వింటుంటే.. నిజంగా వాడు ఒక దేశానికి పనికొస్తాడు కదా.. ఈ మనిషిని ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టమ్లో అతని వినియోగించుకోవచ్చు కదా అని నాకు అనిపించింది. కానీ తెలిసీ తెలియని వయస్సు.
ఖచ్చితంగా ఏదో ఒక డబ్బు లేని తనం. ఇవన్నీ వెంటబడి అతడి మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. అతనికి తెలియదు చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది.. దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి.. ఇకనుంచైనా అతడు మారాలని కోరుకుంటున్నానన్నాడు శివాజీ. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఇమ్మిడి రవి నుంచి వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలను సేకరించి, అతడి సమక్షంలోనే ఆ పైరసీ వేదికలను శాశ్వతంగా క్లోజ్ చేయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు ఇమ్మడి రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల సంఖ్యలో ఉన్న హార్డ్ డిస్క్లను పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. అలాగే, అతని బ్యాంక్ ఖాతాల ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ సామ్రాజ్యం వెనుక ఉన్న వ్యక్తులు, ఆర్థిక వనరులపై లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.
IFFI | సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి.. రజినీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం
Manchu Lakshmi | మంచు లక్ష్మీ నో ఫిల్టర్ కామెంట్స్ వైరల్ .. సినీ పరిశ్రమ, సమాజంపై బాంబుల వర్షం