Raj Tarun – Lavanya | రాజ్ తరుణ్, లావణ్య కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని ఇప్పుడు మాల్వి మల్హోత్రా కోసం తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తోంది. అయితే దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ.. లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రతిదానికి నా దగ్గర ఆధారం ఉంది. నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నేను లీగల్‌గానే వెళతాను న్యాయం జరిగే వరకు పోరాడుతా అంటూ ప్రకటించాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. లావణ్య తమను వేధిస్తోందని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా.. తాజాగా ఇందులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. లావణ్య తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి అనే అమ్మాయి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని.. ఆమె వల్ల చాలామంది జీవితాలు నాశనం అయ్యాయంటూ పిటిషన్లో తెలిపింది. ఇక ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న ఎస్ఐ సుఖేందర్‌రెడ్డి దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Also Read..
Head Bath | ఆ రోజు తలంటు స్నానం చేస్తే అన్నీ శుభాలే తెలుసా..?
Modern Masters : S.S RAjamouli | చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాజమౌళి.. ఏ సినిమానో తెలుసా.?