Head Bath | ఆ రోజు తలంటు స్నానం చేస్తే అన్నీ శుభాలే తెలుసా..?
Head Bath : తలను తడవనీయకుండా కేవలం భుజాలపై నుంచి నీళ్లు పోసుకుని చేసే స్నానాన్ని కేవలం స్నానం అంటారు. కానీ తల స్నానం అనరు. తలపై నుంచి కూడా నీళ్లు పోసుకుంటే దాన్ని తలస్నానం అంటారు. పురుషుల్లో సాధారణ స్నానం చేసేవాళ్లు చాలా తక్కువ.
Head Bath : తలను తడవనీయకుండా కేవలం భుజాలపై నుంచి నీళ్లు పోసుకుని చేసే స్నానాన్ని కేవలం స్నానం అంటారు. కానీ తల స్నానం అనరు. తలపై నుంచి కూడా నీళ్లు పోసుకుంటే దాన్ని తలస్నానం అంటారు. పురుషుల్లో సాధారణ స్నానం చేసేవాళ్లు చాలా తక్కువ. దాదాపు అందరూ తలస్నానమే చేస్తారు. కానీ మహిళలకు రోజూ తలస్నానం సాధ్యపడదు. ఎందుకంటే వారికి తల వెంట్రుకలు పొడవుగా ఉంటాయి కాబట్టి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రోజు తలస్నానం చేస్తే జలుబు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆడవాళ్లు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే తలస్నానం చేస్తారు.
అయితే ఈ తలస్నానం రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి సాధారణ తలస్నానం, రెండోది తలంటు స్నానం. సాధారణ తలస్నానం అంటే ఎప్పటిలాగే తలపై నీళ్లు పోసుకుని చేసే స్నానం. తలంటు స్నానం అంటే మాత్రం ఒంటికి, నెత్తికి నూనె రాసుకుని ఆ తర్వాత కుంకుడు కాయ రసం లేదా షాంపూతో చేసే స్నానం. తలస్నానం తలలో మురికి పోవడానికి వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటారు. తలంటు స్నానం మాత్రం కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో, ఆలయాలకు వెళ్లే రోజుల్లో మాత్రమే చేస్తారు. దీన్నే అభ్యంగన స్నానం అని కూడా అంటారు.
సాధారణ స్నానాల సంగతి పక్కన పెడితే.. ఈ తలంటు స్నానం విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయట. తలంటు స్నానం సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిదట. పొద్దుపోయిన తర్వాత లేదంటే ఏదైనా తిన్న తర్వాత తలంటు స్నానం చేస్తే దాని ఫలితం ఉండకపోగా అనారోగ్యాలు కలుగుతాయట. అయితే వృద్ధులు మాత్రం కాస్త పొద్దుపోయిన తర్వాత చేసినా పర్వాలేదట. అయితే ఈ తలంటు స్నానం ఎప్పుడుపడితే అప్పుడు చేయకూడదట. వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే చేయాలట. వేరే రోజుల్లో చేస్తే మంచిది కాదట.
ముఖ్యంగా బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోందట. మిగతా రోజుల్లో తలంటు స్నానం చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయట. ఆదివారం రోజు తలంటు స్నానం చేస్తే అనారోగ్యం కలుగుతుందట. సంతానానికి కీడు చేకూరుతుందట. సోమవారం తలంటు స్నానం చేస్తే లేనిపోని ఆందోళన ఉంటుందట. భయం వెంటాడుతుందట. శరీరం కాంతిని కోల్పోతుందట. మంగళవారం తలంటు స్నానం చేస్తే ఆయు క్షీణం కలుగుతుందట. భర్తకు విరోధం, అపాయం కలుగుతుందట.
అదేవిధంగా గురువారం రోజు తలంటు స్నానం చేస్తే ధన వ్యయం కలుగుతుందట. శత్రు బాధలు అధికమవుతాయట. అశాంతి కలుగుతుందట. శుక్రవారం తలంటు స్నానం చేస్తే అశాంతి కలుగడమేగాక రోగాలు ఎక్కువవుతాయట. వస్తు నాశనం జరుగుతుందట. అందుకే ఆయా రోజుల్లో తలంటు స్నానం చేయకూడదట. అదే బుధవారం తలంటు స్నానం చేస్తే అన్నీఈ శుభ ఫలితాలే కలుగుతాయట. కీర్తి, సంపద, ధన లాభం కలుగుతుందట. ఏ పని చేసినా కలిసి వస్తుందట. శనివారం తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయట. ఆయుష్షు వృద్ధి చెందుతుందట. కుటుంబ సౌఖ్యం కలుగుతుందట.
అంతేగాక క్రమం తప్పకుండా బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవత మనలను విడిచి వెళ్తుందట. అయితే పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాత్రం ఈ వారం నిబంధనలు వర్తించవట. ఆ పండుగ, పర్వదినం ఏ వారం వచ్చినా తలంటు స్నానం చేసుకోవచ్చట. అదేవిధంగా పై నిబంధలన్నీ తలంటు స్నానానికేగానీ, తల స్నానానికి కాదట. తలస్నానం అవసరాన్ని బట్టి వారం పట్టింపులు లేకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చట.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

