హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం కాగా.. వారిలో మూడో కుమారుడు ఆర్ నారాయణమూర్తి. చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.