హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ (Madhapur Drugs) కేసులో సినీ నటుడు నవదీప్ (Navdeep) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. డ్రగ్స్ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలపై లోతుగా విచారిస్తున్నది. గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన మాదకద్రవ్యాల కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
నైజీరియన్ డ్రగ్పెడ్లర్తోపాటు తెలుగు సినీ నిర్మాత వెంకట్, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్ పేరు బయటికి వచ్చింది. ఈ క్రమంలో టీన్యాబ్ పోలీసులు నవదీప్‌ను సుమారు ఆరు గంటలపాటు విచారించింది. టీన్యాబ్ కేసు ఆధారంగా కేసు నమోదుచేసిన ఈడీ దర్యాప్తు చేస్తున్నది.