టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మావయ్య చంద్రబాబు, లోకేశ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చంద్రబాబుకు మంగళవారం కరోనా సోకగా, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరిద్దరూ హోంక్వారంటైన్లో ఉన్నారు.
కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనంత త్వరగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని కోరారు. అందరు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేశారు.
Wishing you Mavayya @ncbn garu and @naralokesh a speedy recovery. Get well soon! https://t.co/cygw7hmARc
— Jr NTR (@tarak9999) January 18, 2022