Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు గాయాలయ్యాయి. హైదరాబాద్ (Hyderabad)లో ఓ యాడ్ షూటింగ్ (ad shoot) సమయంలో ఆయన ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలైనట్లు (minor injury) టీమ్ తెలిపింది. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు పేర్కొంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కర్ణాటకలో జరుపుకున్న ఈ సినిమా, త్వరలో అమెరికాలో కీలక షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని US కాన్సులేట్‌ని ఎన్టీఆర్ విజిట్ చేశారు. అమెరికా కాన్సుల్ జనరల్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషల అగ్ర తారలు కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌శెట్టి కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రీసెంట్‌గానే జిమ్‌లో తారక్ వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకానుంది.
Also Read..
K Ramp Teaser | కిరణ్ అబ్బవరం ‘కే రాంప్’ టీజర్ విడుదల
Zubeen Garg | చిత్ర పరిశ్రమలో విషాదం.. స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ గాయకుడు మృతి
Bhadrakaali Movie | భద్రకాళి మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని పొలిటికల్ థ్రిల్లర్ అలరించిందా?