K Ramp | యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కే రాంప్ (K Ramp). హాస్య మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మిస్తుండగా.. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.