చెన్నై : ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల (69) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత రెండు వారాలుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. మనోబాల మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 35 ఏండ్ల సినీ ప్రస్ధానంలో ఆయన 450కిపైగా చిత్రాల్లో నటించారు.
Read More: Manobala | అసిస్టెంట్ డైరెక్టర్ టు స్టార్ కమెడియన్.. మనోబాల సినీ జీవితం సాగిందిలా..!
మనోబాలకు భార్య ఉష, కుమారుడు హరీష్ ఉన్నారు. 1979లో భారతీరాజా పుతియ వర్పుగల్ సినిమాతో ఆయన తన సినీ కెరీర్ను ప్రారంభించారు. మనోబాల చివరిగా కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఘోస్టీలో కనిపించారు. కాగా, మనోబాల ఇక లేరని ముందుగా నటుడు, దర్శకుడు జీఎం కుమార్ వెల్లడించారు.
కాలేయ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని తన నివాసంలో మనోబాల కన్నుమూశారని ట్విట్టర్ వేదికగా కుమార్ తెలిపారు. మనోబాల మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోబాల అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
Read More