దేవ్‌గిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహో విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పనిచేసిన త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రికోటి చిత్ర విశేషాలు తెలియజేస్తూ “మగధీర’ టైంలో దేవ్‌గిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆయనకు ప్రేక్షకుల్లో విలన్ ఇమేజ్ ఉంది.
అందుకే ఫ్యామిలీ కథాంశంతో సినిమా చేస్తే అంతగా కుదరదని భావించాం. చివరకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో కథను సిద్ధం చేశాం. ఇందులో దేవ్‌గిల్ ఆంధ్రా నుంచి పుణేకు ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. యాక్షన్, ఎమోషనల్ అంశాలు కలబోసిన ఈ కథ అందరికి కనెక్ట్ అవుతుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మంచి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాలో మదర్సెంటిమెంట్ కూడా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు.