తెలుగు చిత్ర పరిశ్రమ వర్ధమాన నటుడు అల్లు రమేష్ గుండెపోటుతో విశాఖపట్నంలో హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన రమేష్ ప్రతిభ గల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తరుణ్ హీరోగా నటించిన ‘చిరుజల్లు’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు రమేష్. ‘వీధి’, ‘బ్లేడ్ బాబ్జీ’, ‘నెపోలియన్’, ‘కేరింత’ తదితర 50కి పైగా చిత్రాల్లో నటించారు. వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్‌లో నటించారు. ఇటీవల విడుదలైన ‘అనుకోని ప్రయాణం’ అల్లు రమేష్ చివరి సినిమా. ఆయన మృతికి పలువురు నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.